You are connecting from Lake Geneva Public Library, please login or register to take advantage of your institution's Ground News Plan.
Published 18 hours ago • loading... • Updated 18 hours ago
రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తా : లింగమనేని
Summary
అమరావతి : రాజ్యసభ సభ్యుడిగా జనసేన అభ్యర్థిగా శనివారం లింగమనేని రమేష్ తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకంతో రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు. నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు చెప్పారు లింగమనేని రమేష్. రాజ్యసభ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రకటించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేశ్ రాజ్యసభకు వెళ్లడం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. ఆయన సరైన వ్యక్తి. ఈ ఎంపిక పట్ల జనసేన పార్టీ శ్రేణులంతా ఎంతో సంతోషంగా ఉన్నాయని అన్నారు. నామినేషన్ సమయంలో కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు లింగమనేని రమేష్. ఆయన స్వస్థలం విజయవాడ.
This story is only covered by news sources that have yet to be evaluated by the independent media monitoring agencies we use to assess the quality and reliability of news outlets on our platform. Learn more here.
TeluguISM - Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online broke the news18 hours ago on Saturday, June 6, 2026.